వాంఖడే స్టేడియంలోని స్టాండ్ కు తన పేరు పెట్టడంపై రోహిత్ శర్మ స్పందన

  • స్టాండ్ కు తన పేరు పెట్టడాన్ని నమ్మలేకపోతున్నానన్న రోహిత్
  • తన జీవితంలో ఇది అతి పెద్ద గౌరవం అన్న హిట్ మ్యాన్
  • స్టాండ్ పై తన పేరు చూసుకున్నప్పుడు భావోద్వేగం కలుగుతుందన్న రోహిత్
ముంబై వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ... తాను ఆడే స్టేడియంలోని స్టాండ్ కు తన పేరు పెట్టడం అనేది నిజంగా నమ్మలేకపోతున్నానని చెప్పాడు. తన జీవితంలో ఇది అతిపెద్ద గౌరవం అని అన్నాడు. ఆట ఆడటం మొదలు పెట్టినప్పుడు మనం ఎంత కాలం ఆడతామో మనకు తెలియదని చెప్పాడు. మనం సాధించే విజయాలు, మైలురాళ్లను పక్కన పెడితే... ఇలాంటి గౌరవం సాధించడం, ఓ స్టాండ్ కు మన పేరు పెట్టడం వంటివి చాలా గొప్ప విషయాలని అన్నాడు. స్టేడియంలోని స్టాండ్ పై తన పేరు చూసుకున్నప్పుడు ఎంతో భావోద్వేగం కలుగుతుందని చెప్పాడు. 

తాను వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి అదే స్టేడియంలో ఒక స్టాండ్ కు తన పేరు పెట్టేంత వరకు జీవితంలో ఎన్నో జరిగాయని రోహిత్ అన్నాడు. అజాద్ గ్రౌండ్ లో తాము అండర్ 14, అండర్ 16 ట్రైనింగ్ పూర్తి చేసుకుని రంజీ క్రికెటర్లను చూసేందుకు వాంఖడేకి వెళ్లేవాళ్లమని తెలిపాడు. అప్పట్లో వాంఖడేలోకి వెళ్లడం ఎంత కష్టమో తనకు తెలుసని చెప్పాడు. ఆ రోజులను ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. తన తొలి గేమ్ ను వాంఖడేలోనే ఆడానని... ఆ తర్వాత ఎన్నో మరుపురాని మ్యాచ్ లు ఆడానని చెప్పాడు.


More Telugu News

Rohit Sharma Wankhede Stadium Mumbai Cricket Association Team India Captain Indian Cricket Cricket Stand Rohit Sharma's Reaction Wankhede Stand Naming Mumbai Indians