మల్‌రెడ్డి రంగారెడ్డి దమ్ముంటే రాజీనామా చేయాలి: మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్

  • మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానని గాలిమాటలు చెప్పడం కాదన్న కిషన్ రెడ్డి
  • రంగారెడ్డికి పదవి ధ్యాస తప్ప అభివృద్ధి ఆలోచన లేదని వ్యాఖ్య
  • నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకు రాలేదన్న కిషన్ రెడ్డి
మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చెబుతున్నారని, అయితే గాలి మాటలు మాని దమ్ముంటే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రంగారెడ్డికి మంత్రి పదవిపైనే ధ్యాస ఉందని, ప్రజలు, నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆయనకు ఆలోచన లేదని విమర్శించారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ సీకే కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పదవి కోసం ఏడాదిన్నరగా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు ఆయనకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప కాంగ్రెస్ వచ్చాక చేసింది ఏమీ లేదని అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం నియోజకవర్గ ప్రజల దురదృష్టమని అన్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి ఢిల్లీ చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలనే కనీస ఆలోచన కూడా ఆయనకు లేదని అన్నారు.


More Telugu News

Mallareddy Rangar Reddy Manchireddy Kishan Reddy Ibrahim Patnam MLA Telangana Politics BRS Party Congress Party Ministerial Aspiration Resignation Challenge Telangana Assembly Development Issues