హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

  • అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
  • నగరంలో జలమయమైన రహదారులు
  • నగర కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, గాంధీభవన్‌, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్‌ల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


More Telugu News