Anaya Bangar: కొంతమంది క్రికెటర్లు నాకు నగ్న చిత్రాలు పంపారు: సంజ‌య్ బంగ‌ర్ కూతురు అన‌య‌

Sanjay Bangars Daughter Anaya Opens Up About Harrassment in Cricket
  • సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్‌కు గ‌తేడాది లింగ‌మార్పిడి శ‌స్త్ర‌చికిత్స 
  • ఆ త‌ర్వాత త‌న పేరును అన‌య‌గా మార్చుకున్న వైనం
  • ప్ర‌స్తుతం యూకేలో ఉంటున్న ఆమె.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ విష‌యాల వెల్ల‌డి
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగ‌ర్ గ‌తేడాది హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, లింగ‌మార్పిడి శ‌స్త్ర చికిత్స త‌ర్వాత పూర్తిగా అమ్మాయిగా మారిన విష‌యం తెలిసిందే. అలాగే త‌న పేరును అనయగా మార్చుకున్న ఆర్య‌న్ ప్ర‌స్తుతం యూకేలో నివ‌సిస్తున్నారు. 

ఈ క్ర‌మంలో లల్లాంటాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయ తాను క్రికెటర్‌గా ఉన్న‌ప్పుడు, ఆ త‌ర్వాత అమ్మాయిగా మారిన అనంత‌రం జ‌రిగిన ప‌లు కీల‌క విష‌యాల‌ను పంచుకున్నారు. త‌న‌కు 8-9 ఏళ్లు ఉన్న‌ప్పుడే త‌న‌లో మార్పును గ‌మ‌నించి తాను అమ్మాయిగా మారాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. 

తాను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి కొంతమంది ప్రసిద్ధ క్రికెటర్లతో క‌లిసి ఆడిన‌ట్లు చెప్పారు. అయితే, త‌న‌లోని మార్పును ఎప్పుడూ తోటి క్రికెట‌ర్ల వ‌ద్ద ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. ఎందుకంటే త‌న తండ్రి అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి త‌న‌ గురించి రహస్యంగా ఉంచుకోవలసి వచ్చిందని తెలిపారు. 

ఇక లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తోటి క్రికెటర్ల స్పందనపై అనయకు ప్ర‌శ్న ఎదురైంది. దీనికి బ‌దులిస్తూ... "మద్దతు ఉంది, కొంత వేధింపులు కూడా ఉన్నాయి" అని ఆమె అన్నారు. దాంతో ఏ విధమైన వేధింపులు? అని యాంకర్ ప్ర‌శ్నించారు.  

కొంతమంది క్రికెటర్లు త‌న‌కు వారి నగ్న చిత్రాలను పంపార‌ని అనయ బదులిచ్చారు. అలాగే తాను ఇండియాలో ఉన్నప్పుడు త‌న ప‌రిస్థితి గురించి ఓ మాజీ క్రికెట‌ర్‌కు చెప్ప‌గా... అతను కారులో వెళ్దాం, నేను మీతో గడపాలని చెప్పిన‌ట్లు ఆమె తెలిపారు. ఈ ఇంట‌ర్వ్యూలో అన‌య చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

Anaya Bangar
Sanjay Bangar
Indian Cricketers
Gender Transition
LGBTQ+
Sexual Harassment
Nude Photos
Viral Interview
Musheer Khan
Sarfaraz Khan
Yashasvi Jaiswal

More Telugu News