బీసీసీఐ సంచలన నిర్ణయం.. అసిస్టెంట్ కోచ్ నాయర్‌పై వేటు
- ఇంగ్లండ్ పర్యటనకు ముందు స్టాఫ్‌ను తగ్గించిన బీసీసీఐ
- టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ఓటములను సమీక్షించిన బోర్డు
- ఫీల్డింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయం
అలాగే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలిసింది. జులైతో వీరి కాంట్రాక్ట్ ముగియనుండగా దిలీప్ స్థానంలో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న టెన్ డెస్కటే ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు నిర్వహిస్తాడని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లీ రౌక్స్ మరోసారి సేవలు అందించనున్నట్టు తెలిసింది.