Sunrisers Hyderabad: భారీ స్కోరు కొడతారనుకుంటే....సన్ రైజర్స్ ఇలా ఆడారేంటి?

ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి సన్ రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబయి ఇండియన్స్ (MI) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ ఆశించిన రీతిలో ఆడలేకపోయింది. ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ 40, ట్రావిస్ హెడ్ 28, నితీశ్ కుమార్ రెడ్డి 19, హెన్రిచ్ క్లాసెన్ 37, అనికేత్ వర్మ 18 (నాటౌట్) పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (2) విఫలమయ్యాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ముంబయి బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ, పరుగుల వేగాన్ని నియంత్రించారు. దాంతో సన్ రైజర్స్ బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు.
ముంబయి ఇండియన్స్ బౌలర్లు ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసి సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఫీల్డింగ్‌లో కూడా ముంబయి ఆటగాళ్లు చురుగ్గా కదిలారు. ముంబయి బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్ 1, బుమ్రా 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు.