Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం... ఇద్దరు పిల్లల్ని నరికి చంపిన తల్లి!

హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో దారుణం జరిగింది. ఓ కసాయి తల్లి తన ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపింది. అనంతరం ఆమె భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. హత్యకు గురైన పిల్లల వయసు 7, 5 ఏళ్లు ఉంటాయని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.