తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్... పెరగనున్న లిక్కర్ ధరలు!

  • ఇప్పటికే బీర్ల ధరలను భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం
  • లిక్కర్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్న సర్కార్
  • ఫుల్ బాటిల్ పై కనీసం రూ. 50 పెంపు
తెలంగాణలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మందు ప్రియులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే బీర్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పడు లిక్కర్ వంతు వచ్చింది. మందు బాటిళ్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 

చీప్ లిక్కర్ మినహా అన్ని రకాల లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం ధరలను ప్రభుత్వం పెంచబోతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఫుల్ బాటిల్ ధర ప్రస్తుత ధరను బట్టి కనీసం రూ. 50 వరకు పెరగనుంది. ఫుల్ బాటిల్ ధర రూ. 500 కంటే ఎక్కువ ఉన్న మద్యం రేట్లన్నీ పెరగుతాయి.


More Telugu News