ధోనీ కోపం గురించి వెల్లడించిన విండీస్ మాజీ ఆటగాడు

  • ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విండీస్ మాజీ ప్లేయ‌ర్ డ్వేన్ స్మిత్‌
  • ఐపీఎల్‌లో ఎంఐ, సీఎస్‌కే జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన క‌రేబియ‌న్ స్టార్‌
  • ఈ రెండు జ‌ట్ల‌లో త‌న‌కు చెన్నై అంటే బాగా ఇష్ట‌మ‌న్న స్మిత్‌
  • ఈ క్ర‌మంలో ధోనీకి కోపం రావటం చూశారా అంటూ స్మిత్‌కు ప్ర‌శ్న 
  • ఆ ప్ర‌శ్న‌కు ఆసక్తిక‌ర స‌మాధానం చెప్పిన విండీస్ మాజీ ఆట‌గాడు
టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గురించి వెస్టిండీస్ మాజీ ప్లేయ‌ర్ డ్వేన్ స్మిత్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఈ క‌రేబియ‌న్ క్రికెట‌ర్ ఐపీఎల్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలోనే డ్వేన్ స్మిత్ కు యాంక‌ర్ ఈ రెండు జ‌ట్ల‌లో మీకు ఏది ఇష్ట‌మ‌ని అడిగాడు. దాంతో స్మిత్‌... త‌న‌కు సీఎస్‌కే చాలా ఇష్ట‌మ‌ని, అలాగ‌ని ఎంఐ అంటే ఇష్టం లేద‌ని కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే, తాను చెన్నైలో ఉన్న‌ప్పుడు చాలా ఎంజాయ్ చేసిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఆ జ‌ట్టుకు బాస్ త‌లా ధోనీ అని తెలిపాడు. 

ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉండ‌డం అత‌ని ప్ర‌త్యేక‌త అని అన్నాడు. అలాగే జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క ఆట‌గాడి స‌మ‌ర్థ‌త‌, బ‌ల‌హీన‌త‌ల‌ను అంచ‌నా వేయ‌డంలో ఎంఎస్‌డీ మాస్ట‌ర్ అని చెప్పాడు. అలాగే ప్లేయ‌ర్ల‌ను చాలా బాగా అర్థం చేసుకుంటాడ‌ని తెలిపాడు. అలాగే ధోనీకి అస‌లు కోపం రాద‌ని, అత‌నికి కోపం వ‌చ్చిందంటే మీరు నిజంగా ఏదో చెడు చేసి ఉండాలి అని అన్నాడు. ఈ క్ర‌మంలో స్మిత్‌కు యాంక‌ర్ నుంచి మీరు ఎప్పుడైనా ధోనీకి కోపం రావటం చూశారా అనే ప్ర‌శ్న ఎదురైంది. 

ఈ ప్ర‌శ్న‌కు స్మిత్ బ‌దులిస్తూ...  "ఒక‌సారి ఫీల్డింగ్ చేస్తున్న‌ప్పుడు అశ్విన్ క్యాచ్ వ‌దిలేశాడు. అది రెగ్యులేషన్ క్యాచ్. దాంతో ధోనీ అతన్ని స్లిప్ నుంచి తీసేసి వేరే చోట ఉంచాడు. నేను అతన్ని కోపంగా చూడటం అదే మొదటిసారి. మరోసారి, హోటల్ సిబ్బంది ధోనీ ఆదేశించిన ఆహారాన్ని డెలివరీ చేయకుండా ఆపింది. అప్పుడు అతను కోపంతో వెంటనే వేరే హోటల్‌కు మారాడు" అని స్మిత్ ధోనీ గురించి ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు.


More Telugu News