కారు తీయకుండానే సిమెంట్ రోడ్డు వేసేశారు!
ఎందుకిలా కారును తీయకుండా రోడ్డు వేశారు అని పంచాయతీ సిబ్బందిని అడిగితే... సిమెంట్ రోడ్డు వేస్తున్నందున కారు తీయాలని ఆ కారు యజమానికి చెప్పామని, కానీ అతడు తాము చెప్పింది వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయాడని వెల్లడించారు. దాంతో కాంట్రాక్టర్ కారు తీయకుండానే రోడ్డుపై కాంక్రీట్ వేసుకుంటూ వచ్చారని పంచాయతీ సిబ్బంది వివరించారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.