తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన
- కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడి
- మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువవచ్చునని వెల్లడి
- గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.