Hyderabad Pub Raid: హైదరాబాద్ పబ్ లో అశ్లీల నృత్యాలు... 16 మంది అమ్మాయిలు అరెస్ట్

Hyderabad Pub Raid 16 Girls Arrested for Obscene Dancing

  • చైతన్యపురిలోని వైల్డ్ హారట్స్ పబ్ లో అశ్లీల నృత్యాలు
  • ఆకస్మిక దాడులు నిర్వహించిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు
  • పరారీలో పబ్ యజమాని, మేనేజర్

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ పై ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పబ్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులు, డీజే ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు వారిని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. 

ఈ సందర్భంగా చైతన్యపురి సీఐ వెంకటేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా వైల్డ్ హారట్స్ పబ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పబ్ లోకి ఫ్రీగా ఎంట్రీ కల్పిస్తూ... యువతులను ఎరవేసి ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని వెల్లడించారు. 

పబ్ కు వచ్చిన యువకుల వద్దకు అమ్మాయిలను పంపుతూ, వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ, ఎక్కువ మద్యం తాగేలా చేస్తూ అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని సీఐ తెలిపారు. 16 మంది యువతులను, డీజే ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్నామని... పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ లు పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Hyderabad Pub Raid
Illegal Dance Performances
16 Girls Arrested
Cyberabad Police
Wild Harrats Pub
Green Hills Colony
LB Nagar SWAT
Chaitanyapuri Police Station
Obscene Dancing
Trafficking
  • Loading...

More Telugu News