చత్తీస్గఢ్లో మరోసారి ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల మృతి
- ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి
- ఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
- అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు
ఆ తర్వాత అక్కడ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ తెలిపారు.