Gangavva: గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదు!

- యూట్యూబ్ వీడియోలతో పాప్యులరైన గంగవ్వ
- బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్‌తో మరింతగా పెరిగిన ఫాలోయింగ్
- సోషల్ మీడియాలో గంగవ్వ తాజా లుక్ ఫోటోలు వైరల్
- రకరకాలుగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు
గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మై విలేజ్ షో యూట్యూబ్ వీడియోలతో గంగవ్వ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సంప్రదాయబద్ధమైన లుక్‌లో తెలంగాణ యాసతో ఆమె మాట్లాడుతుంటే ఎవరికైనా వాళ్ల నానమ్మ లేదా అమ్మమ్మ గుర్తుకు వచ్చేది. యూట్యూబర్‌గా చాలా పాప్యులర్ అయిన గంగవ్వ ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొని సందడి చేసింది.
ఆ తర్వాత సినీ రంగంలోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, స్వాగ్, గేమ్ ఛేంజర్ వంటి పలు సినిమాల్లోనూ నటించింది. అయితే గంగవ్వ తాజా లుక్ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఆమె తాజా ఫోటోలు, వీడియోలు చూసిన వారు ఆమె అసలు గంగవ్వేనా అన్నట్లుగా మారిపోయి కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
గంగవ్వ ఇటీవల హైదరాబాద్‌లో బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ ప్రారంభించిన బీబీసీ సెలూన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెయిర్‌ను స్ట్రెయిటనింగ్ చేయించుకుంది. అలానే తన జుట్టుకు నల్లరంగు వేయించుకోవడంతో పాటు కాలికి పెడిక్యూర్ కూడా చేసుకుంది. గంగవ్వ తన జుట్టును లూజుగా వదిలేసి కొత్త లుక్‌లోకి మారిపోయింది.
తాజా మేకప్‌తో గంగవ్వకు వృద్ధాప్యం కారణంగా ముఖం మీద వచ్చిన మడతలు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. గంగవ్వ తాజా లుక్‌లోకి మారడంతో అసలు ఆమెకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజా లుక్‌లో ఉన్న గంగవ్వ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.