ఏపీ లిక్కర్ స్కాం... చిత్రపురి కాలనీలోని మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు
- హైదరాబాద్లో రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
- మధ్యాహ్నం నుంచి మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు
- నిన్న రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు
ఈ రోజు రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉన్న మేఘనా రెడ్డి నివాసంలో మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో దర్యాప్తు బృందం నిన్న సోదాలు నిర్వహించింది. నగరంలోని మూడు ప్రాంతాల్లో మొత్తం 50 మంది సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.