Punjab Kings: 111 పరుగులకే కుప్పకూలిన పంజాబ్ కింగ్స్

- ఛండీగఢ్ లో పంజాబ్ కింగ్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
- 15.3 ఓవర్లలోనే ఆలౌట్
కోల్ కతా నైట్ రైడర్స్ తో సొంతగడ్డ ఛండీగఢ్ లో ఆడుతున్న పంజాబ్ కింగ్స్ అనూహ్య రీతిలో స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 30, ప్రియాన్ష్ ఆర్య 22 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (0) డకౌట్ అయ్యాడు. నేహాల్ వధేరా 10, జోష్ ఇంగ్లిస్ 2, గ్లెన్ మ్యాక్స్ వెల్ 7 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో శశాంక్ సింగ్ 18 పరుగులు చేయడంతో పంజాబ్ స్కోరు 100 దాటింది.
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్రాణా 3, వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా 1, ఆన్రిచ్ నోర్కియా 1 వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య దూకుడు చూస్తే ఆ జట్టు 200 పరుగులు దాటడం ఈజీ అనిపించింది. కానీ, 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండానే పంజాబ్ ఆటగాళ్లు చాపచుట్టేశారు.