Punjab Kings: సొంతగడ్డపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

- ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
- చండీగఢ్ లో మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఛండీగఢ్ లో జరుగుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ జట్టులో ఒక మార్పు చేశారు. ఆల్ రౌండర్ మొయిన్ అలీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆన్రిచ్ నోర్కియా ఆడుతున్నాడు. పంజాబ్ టీమ్ లో జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్లెట్ లకు స్థానం కల్పించారు.
టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా... కోల్ కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది.