Kalyan Ram: సన్నగా మారిన ఎన్‌టీఆర్.. కల్యాణ్ రామ్ ఏమన్నారంటే..!

- 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా కల్యాణ్ రామ్
- ఈ క్రమంలో ఆయనకు ఓ ఇంటర్వ్యూలో ఎన్‌టీఆర్ సన్నగా మారడంపై ప్రశ్న
- తారక్ పాన్ ఇండియా హీరో అన్న కల్యాణ్ రామ్
- ఆయన ఏం చేసినా, ఎలా ఉన్నా... సినిమా కోసమేనని స్పష్టీకరణ
ఇటీవల జూనియర్ ఎన్‌టీఆర్ బాగా సన్నగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై స్పందించారు. తారక్ పాన్ ఇండియా హీరో అని, ఆయన ఏం చేసినా... ఎలా ఉన్నా సినిమా కోసమేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కల్యాణ్ రామ్ తాను హీరోగా నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్‌కు తారక్ ఎందుకు సన్నగా అయ్యారు... మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు.
"తారక్ ఓ సూపర్ స్టార్. పాన్ ఇండియా హీరో. దేశంలోనే అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. వాళ్లిద్దరికీ నేను సలహా ఇస్తానా? ఎన్‌టీఆర్ ఏం చేసినా సినిమా కోసమే" అని అన్నారు.
ఇక ఎన్‌టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్2' షూటింగ్ పూర్తి చేశారు. ఈ నెల 22 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 'దేవర-2' చేయనున్నారు. కల్యాణ్ రామ్ నిర్మాతగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో 'దేవర-2'పై భారీ అంచనాలు ఉన్నాయి.