Chandrababu Naidu: నెం.2 స్థానంలో ఉన్నామంటే మనం ఇంకా గట్టిగా కృషి చేయాలని అర్థం: సీఎం చంద్రబాబు

- అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న ఏపీ
- దేశంలోనే నెంబర్ 2గా ఆంధ్రప్రదేశ్
- సోషల్ మీడియాలో స్పందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25 ఏడాదికి గాను ఆర్థిక వృద్ధి రేటు పరంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి పరంగా దూసుకెళుతున్నట్టు ఈ జాతీయ నివేదిక చెబుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"1990 ప్రాంతంలో నేను మొట్టమొదట ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది. అప్పుడు బెంగళూరు నెంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ ఇవాళ చూస్తే అన్ని రంగాల్లో హైదరాబాద్ నగరం నెంబర్ వన్ అయింది. అదే విధంగా, ఇవాళ మన ముందు ఒక కొత్త సవాలు లేదా కొత్త అవకాశం మన ముందు నిలిచింది. దీన్ని మనం అందిపుచ్చుకుని ముందుకెళ్లాలి. నెంబర్ 2 స్థానంలో ఉన్నామంటే మనం ఇంకా గట్టిగా కృషి చేయాలని అర్థం" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.