Dubai: దుబాయిలో ఇద్ద‌రు తెలుగోళ్లను దారుణంగా హ‌త్య చేసిన పాకిస్థానీ!

Pakistani National Kills Two Telugu Workers in Dubai

  • చంపిన తర్వాత పాకిస్థానీ మతపరమైన నినాదాలు
  • మృతుల్లో ఒకరిది నిర్మల్‌.. మరొకరిది నిజామాబాద్‌ జిల్లా
  • అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు

దుబాయిలో తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిని ఓ పాకిస్థానీ దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌త శుక్ర‌వారం ఇద్ద‌రు తెలుగోళ్లను పాకిస్థాన్ పౌరుడు అతి కిరాత‌కంగా నరికి చంపాడు. నిర్మ‌ల్ జిల్లా సోన్‌కు చెందిన అష్ట‌పు ప్రేమ్‌సాగ‌ర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయిలోని ఓ పేరొందిన బేక‌రీలో ప‌నిచేస్తున్నారు. 

అదే బేక‌రీలో ప‌నిచేసే ఓ పాకిస్థానీ ప‌ని ఒత్తిడి, మ‌త విద్వేషంతో వీరిద్ద‌రిని దారుణంగా న‌రికి చంపాడు. ఈ దాడిలో మ‌రో ఇద్ద‌రు తెలుగువారు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంద‌ని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Dubai
Pakistani Killer
Dubai Murders
Telugu Workers
Prem Sagar
Srinivas
Nirmal District
Nizamabad District
Bakery Killing
Hate Crime
Dubai Crime
  • Loading...

More Telugu News