Bhupana Karunakar Reddy: తిరుమలలో పనిచేస్తున్న ఆ రెండువేల మందీ మావారే.. భూమన సంచలన వ్యాఖ్యలు

Bhupanas Sensational Remarks on TTD Employees

  • వారంతా మా నిఘా నేత్రాలన్నభూమన
  • తిరుమల పరిణామాలపై మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందన్న వైసీపీ నేత
  • గోవుల మృతిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న భూమన

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగులు తమవారేనని, వారంతా తమ నిఘా నేత్రాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ద్వారా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని తెలిపారు. తిరుపతిలో నిన్న మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. గోవుల మృతి విషయంలో టీటీడీ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లో తేడా ఉందన్నారు. చైర్మన్, ఈవోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తాము విడుదల చేసిన ఫొటోలపై విచారణకు సిద్ధమని సవాలు విసిరారు. తమ ఆరోపణలు తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా రెడీ అని భూమన తెలిపారు.

Bhupana Karunakar Reddy
Tirumala Tirupati Devasthanams
TTD
Andhra Pradesh Politics
YCP
SV Gosala
Tirupati
Cattle Deaths
Controversial Remarks
Media Conference
  • Loading...

More Telugu News