Janagama: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు
- స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ వద్ద ప్రమాదం
- ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో కారుకు ప్రమాదం
తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎరుపు రంగు కియా కారు అతి వేగంగా ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.