Robots Boxing: రోబోల మధ్య బాక్సింగ్... కానీ పంచ్ లో పవర్ లేదు!

టెక్నాలజీ ద్వారా సాధ్యమైన కొన్ని ఘనతల్లో రోబోలు కూడా ఒకటి. ఇప్పుడీ మరమనుషులు దాదాపు అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా చైనాలో రోబోల మధ్య బాక్సింగ్ బౌట్ నిర్వహించారు. జీ1, హెచ్1 అనే రెండు హ్యూమనాయిడ్ రోబోలను బాక్సింగ్ రింగ్ లోకి దించారు. రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను చైనాకు చెందిన టెక్ సంస్థ యూనిట్రీ విడుదల చేసింది.
జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా... హెచ్1 రోబో ఎత్తు 5.11 అడుగులు. అయితే, ఈ రోబోలు పంచ్ లు, కిక్ లు విసురుతున్నా వాటిలో పవర్ లేకపోవడంతో ఈ బౌట్ నిస్సారంగా సాగింది. విరామం లేకుండా స్పారింగ్ చేయడం మాత్రం ఆకట్టుకుంది.