Rajamouli: నేను కూడా సాధారణ ప్రేక్షకుడ్నే... ఆ సినిమాల కోసం వేచి చూస్తున్నా: రాజమౌళి

Rajamouli Awaits These 3 Pan India Films

  • ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్ తాజా మూవీల కోసం ఎదురుచూస్తున్నానన్న రాజమౌళి
  • తాజా ఇంటర్వ్యూలో ఆ సినిమాలపై మాట్లాడిన రాజమౌళి
  • సోషల్ మీడియాలో రాజమౌళి కామెంట్స్ వైరల్

రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుంది. ఈ విషయాన్ని ఎవరినడిగినా చెబుతారు. అలాంటిది రాజమౌళి మాత్రం మూడు సినిమాల కోసం వేచి చూస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయింది.

రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా, ప్రస్తుతం ఫారిన్‌లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా ఓ ప్రేక్షకుడిగా కొన్ని సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్', ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న మూవీ 'స్పిరిట్‌'తో పాటు రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న 'పెద్ది' మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి చెప్పారు. ఈ మూడూ పాన్ ఇండియా మూవీలే కావడంతో ఎలా ఉంటాయో అనే ఆతృత తనకు కూడా ఉందని ఆయన అన్నారు. ఈ మూవీలపై రాజమౌళి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయా మూవీ హీరోల అభిమానులు సంతోషపడుతున్నారు.

ఇక ఈ మూవీల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ 'డ్రాగన్' షూటింగ్‌ దశలో ఉంది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ప్రభాస్ – సందీప్ కాంబో మూవీ 'స్పిరిట్'కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి సంబంధించి ఇటీవలే గ్లింప్స్ విడుదలయ్యాయి. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుండగా, ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. 

Rajamouli
RRR director
Tollywood
Telugu Cinema
Upcoming Telugu Movies
NTR
Prabhas
Ram Charan
Prashanth Neel
Sandip Reddy Vanga
Buchi Babu
  • Loading...

More Telugu News