తిరుమలకు బయల్దేరిన పవన్ అర్ధాంగి అనా కొణిదెల
- రేపు సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకోనున్న అనా కొణిదెల
- సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడిన మార్క్ శంకర్
- మొక్కు తీర్చుకోనున్న పవన్ అర్ధాంగి అనా
కొన్ని రోజుల కిందట సింగపూర్ లోని ఓ కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం మార్క్ శంకర్ ను తీసుకుని పవన్, అనా కొణిదెల ఇండియా తిరిగొచ్చారు.