Anna Lezhneva: తిరుమలకు బయల్దేరిన పవన్ అర్ధాంగి అనా కొణిదెల

- రేపు సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకోనున్న అనా కొణిదెల
- సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడిన మార్క్ శంకర్
- మొక్కు తీర్చుకోనున్న పవన్ అర్ధాంగి అనా
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్ధాంగి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆమె ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనా కొణిదల రేపు (సోమవారం) వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కొన్ని రోజుల కిందట సింగపూర్ లోని ఓ కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం మార్క్ శంకర్ ను తీసుకుని పవన్, అనా కొణిదెల ఇండియా తిరిగొచ్చారు.