అనకాపల్లి జిల్లాలో బాణసంచా కర్మాగారంలో పేలుడు... ఆరుగురి మృతి

అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు జరిగిన ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు సామర్లకోటకు చెందినవారిగా గుర్తించారు. 

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం జరిగిన పేలుడుతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి.

Anakapalli Firecracker Factory Explosion
Anakapalli District
Kailasapatnam
Kotavuratla Mandal
Firecracker Factory Blast
Andhra Pradesh Accidents
India Accidents
Fatal Accidents

More Telugu News