టీడీపీ నేతపై కత్తితో దాడి చేసిన వైసీపీ నేత

  • పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఘటన
  • టీడీపీ నేత హరినాథ్ పై వైసీపీ నేత వేణుగోపాల్ కత్తితో దాడి
  • పొలానికి దారి విషయంలో కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదం
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నేతపై వైసీపీ నేత కత్తితో దాడి చేశాడు. గత నెలలో టీడీపీ కార్యకర్త రామకృష్ణపై వైసీపీ నేత వెంకటరమణ దాడి చేసి హత్య చేశాడు. తాజాగా వెంకటరమణ బంధువు వేణుగోపాల్ టీడీపీ నేత హరినాథ్ పై కత్తితో దాడి చేశారు. 

ఈ దాడిలో హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పొలానికి దారి విషయంలో వీరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ విషయాన్ని వారు పోలీసులు దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే హరినాథ్ పై దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.


More Telugu News

Venkataramana HariNath TDP leader attacked YSRCP leader Chittoor Punganur Krishnapur Political Violence Andhra Pradesh Land Dispute