Pakistan: పాకిస్థాన్ లో భారీ భూకంపం

58 Magnitude Earthquake Hits Pakistan

  • రావల్పిండికి 60 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత
  • జమ్మూకశ్మీర్ వరకు ప్రకంపనలు

పాకిస్థాన్ ను భారీ భూకంపం వణికించింది. రావల్పిండికి 60 కిలోమీటర్ల దూరంలో... భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా ఉంది. 

ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్ వరకు భూప్రకంపనలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. భూకంపం నేపథ్యంలో పాకిస్థాన్ లో రైళ్ల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించారు. అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి.

Pakistan
Earthquake
Pakistan Earthquake
5.8 Magnitude Earthquake
Rawalpindi
Jammu and Kashmir
Seismic Activity
National Center for Seismology
earthquake Pakistan today
pakistan earthquake news
  • Loading...

More Telugu News