Vanajeevi Ramayya: వనజీవి రామయ్య మృతిపై జగన్ స్పందన

- గుండెపోటుతో కన్నుమూసిన వనజీవి రామయ్య
- రామయ్య మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
- ఆయన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్వీట్
తన జీవితాన్ని మొక్కల పెంపకానికే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిదని జగన్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జగన్ అన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.
కోటి మొక్కలకు పైగా నాటి, పుడమితల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.