Chandrababu Naidu: నిన్న ఒంటిమిట్టలో కల్యాణోత్సవ ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు: బీఆర్ నాయుడు

CM Chandrababu Naidu Expresses Satisfaction Over Ootimitta Kalyana Mahotsavam

  • నిన్న ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కల్యాణోత్సవం 
  • టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుక
  • టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని అభినందించిన సీఎం చంద్రబాబు

కడప జిల్లాలోని సుప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిన్న సీతారామ కల్యాణ మహోత్సవం కనుల పండుగలా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. దీనిపై ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. 

నిన్న ఒంటిమిట్టలో  జరిగిన శ్రీరామ కల్యాణ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేయడంపై సంతోషం వెలిబుచ్చారని తెలిపారు. చంద్రబాబు ఒంటిమిట్ట శ్రీరామునికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, కల్యాణాన్ని ఆసాంతం తిలకించారని బీఆర్ నాయుడు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కల్యాణోత్సవం జరగడం సంతోషదాయకమని సీఎం అన్నారని వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు తనను అభినందించిన ఫొటోలను కూడా బీఆర్ నాయుడు పంచుకున్నారు.

Chandrababu Naidu
BR Naidu
Ootimitta
Sri Rama Kalyanam
Kodanda Ramaswamy Temple
Kadapa
Andhra Pradesh
TTD
Religious Festival
CM's Satisfaction
  • Loading...

More Telugu News