Kakani Govardhan Reddy: పులి అన్నావ్, తొడగొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లావు? కాకాణిపై సోమిరెడ్డి సెటైర్

Somireddys Satire on Kakani Amidst Mining Scam Probe

  • ఎక్కడికీ పారిపోలేదంటున్నావ్ మరి ఎక్కడా కనిపించవేం?
  • పోలీసుల విచారణకు హాజరు కావడంలేదేమని నిలదీత
  • ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ వంశీ ఉంటాడు.. పలకరించు అంటూ ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. అయితే, మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. మొదటిసారి నోటీసులు అందుకున్న సమయంలో మీడియా ముందుకు వచ్చిన కాకాణి.. తాను నియోజకవర్గంలోనే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని చెప్పారు. ప్రస్తుతం ఆయన జాడ తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

‘ఎక్కడికీ పారిపోనని చెప్పావ్ మరి ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదేం? పులిని అన్నావ్, తొడ కొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి పోయావు? పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడంలేదు?’ అని ప్రశ్నించారు. పోలీసులు విచారణకు పిలిస్తే కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విచారణకు హాజరుకావచ్చు కదా అని సలహా ఇచ్చారు. ‘ఒకవేళ నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు, పలకరించు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.

Kakani Govardhan Reddy
Somireddy Chandramohan Reddy
Andhra Pradesh Mining Scam
Police Notices
TDP MLA
Investigation
Missing Politician
Political Satire
AP Politics
Vallabhaneni Vamsi
  • Loading...

More Telugu News