Viral Video: గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో పెట్టుకుని హాస్ట‌ల్‌కి తీసుకెళ్లేందుకు య‌త్నం.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!

Girlfriend Hidden in Suitcase Students Hostel Attempt Goes Viral

  • హ‌ర్యానాలోని సోనిప‌ట్‌లోని ఓపీ జిందాల్ విశ్వ‌విద్యాల‌యంలో ఘ‌ట‌న
  • గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను త‌న హాస్ట‌ల్‌కు తీసుకెళ్లేందుకు తెగించిన యువ‌కుడు
  • చెకింగ్‌లో సెక్యూరిటీకి దొరికిపోయిన వైనం
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను త‌న హాస్ట‌ల్‌కు తీసుకెళ్లేందుకు ఓ యువ‌కుడు తెగించాడు. ఆమెను సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తీసుకెళ్లాల‌ని చూశాడు. కానీ, చెకింగ్‌లో సెక్యూరిటీకి దొరికిపోయాడు. హ‌ర్యానాలోని సోనిప‌ట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వ‌విద్యాల‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

ఒక విద్యార్థి త‌న ల‌వ‌ర్‌ను బాలుర హాస్టల్‌లోకి తీసుకెళ్ల‌డానికి ప్రయత్నించాడు. దానికోసం అత‌డు ఒక పెద్ద సూట్‌కేస్‌ను తీసుకున్నాడు. అందులో ఆ అమ్మాయిని ప్యాక్ చేశాడు. అనంత‌రం అదే సూట్‌కేస్‌తో హాస్ట‌ల్‌లోకి ప్ర‌వేశించాడు. అయితే, హాస్టల్ గార్డులకు విద్యార్థిపై అనుమానం రావ‌డంతో ఆపి, లగేజ్ చెక్ చేశారు. ఈ క్ర‌మంలో ఆ సూట్‌కేస్‌ను తెర‌వ‌గా లోప‌ల‌ అమ్మాయి కనిపించ‌డంతో నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే సూట్‌కేస్‌లోంచి ఆ అమ్మాయిని బ‌య‌ట‌కు తీశారు.

ఆ స‌మ‌యంలో తోటి విద్యార్థులు ఈ సంఘ‌ట‌న‌ను వీడియో తీశారు. ఆ త‌ర్వాత వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ సంఘటనపై విశ్వవిద్యాలయం ఇంకా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ విద్యార్థిపై ఏదైనా చర్య తీసుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. 

Viral Video
OP Jindal University
Sonipat
Haryana
Girlfriend in Suitcase
Hostel Incident
Student
Love Affair
Security Check
Social Media
  • Loading...

More Telugu News