James Anderson: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్‌కు ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్ పురస్కారం

James Anderson to Receive Prestigious Knighthood

  • 21 సంవత్సరాలపాటు క్రికెట్‌లో కొనసాగిన జేమ్స్ అండర్సన్
  • సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక కాలం కొనసాగిన రెండో క్రికెటర్‌గా ఘటన
  • ఇంగ్లండ్ క్రికెట్ కు అందించిన విశిష్ట సేవలకు తగిన గుర్తింపు 

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ త్వరలో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘నైట్‌ హుడ్’ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. 21 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్‌కు గాను ఈ పురస్కారం అందుకోనున్నాడు. బ్రిటన్ లో ప్రధానిగా పనిచేసి, పదవి నుంచి వైదొలిగే సమయంలో ఆయనకు ఉండే విశిష్ట అధికారాలతో పలువురికి విశిష్ఠ పురస్కారాలను, క్షమాభిక్షలను ప్రకటించే వీలుంటుంది. ఆ విధంగా మాజీ ప్రధాని రిషి సునాక్ ప్రకటించిన పురస్కారాల జాబితాలో జేమ్స్ ఆండర్సన్ కూడా ఉన్నాడు.

42 ఏళ్ల అండర్సన్ గతేడాది క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కెరియర్‌లో 188 టెస్టులు ఆడిన అండర్సన్ 704 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక కాలం క్రికెట్‌లో కొనసాగిన రెండో క్రికెటర్‌గా అండర్సన్ రికార్డులకెక్కాడు. గతేడాది జులైలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టే అండర్సన్‌కు చివరి మ్యాచ్. 2003లో 20 ఏళ్ల వయసులో ఇదే మైదానంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేయడం విశేషం.

2015 నుంచి వన్డేలకు దూరమైనప్పటికీ ఇంగ్లండ్ తరపున వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు అండర్సన్ పేరునే ఉంది. 29.22 సగటుతో వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 18 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 991 వికెట్లు సాధించి 1000కి 9 వికెట్ల దూరంలో నిలిచిపోయాడు. 

James Anderson
Knighthood
England cricketer
Test cricketer
Cricket
Rishi Sunak
Sachin Tendulkar
Sports Award
Retirement
Record wickets
  • Loading...

More Telugu News