G. Bhanumurthy Raju: జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఏపీ విద్యార్ధులు వీరే

AP Students Selected for National Under 17 Sepak Takraw

  • జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపిక
  • అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు 
  • ఈ నెల 15 నుంచి 21 వరకు మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ శాయ్ సెంటర్‌లో జాతీయ స్థాయి పోటీలు

జాతీయ స్థాయి అండర్-17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 వరకు మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ శాయ్ సెంటర్‌లో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావును ఏపీ జట్టు క్రీడాకారులు కలిశారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులను అభినందించిన ఆయన విజయవంతంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

అండర్-17 బాలుర జట్టులో జి. సతీష్ (దేవరాపల్లి, పశ్చిమగోదావరి), కె. కుశల్ (కేబీసీ బాయ్స్ హైస్కూల్, పటమట, ఎన్టీఆర్ జిల్లా), డీఎం. షాహిద్ (ఉరవకొండ, అనంతపురం), టి. జశ్వంత్ (విశాఖపట్నం), టి. వంశీ (కేబీసీ బాయ్స్ హైస్కూల్, పటమట, ఎన్టీఆర్ జిల్లా), బాలికల జట్టులో పి. హరి ప్రియ (కేబీసీ), కె. వెంకట లక్ష్మి (కేబీసీ), పి. దుర్గ మధుర శ్రీ (దేవరాపల్లి, పశ్చిమ గోదావరి), సి. తేజ (ఉరవకొండ), జి. రమ్య (కాకినాడ)లు ఉన్నారు. ఈ జట్లకు పీఈటీలు కోచ్‌లుగా ఎస్. రమేష్ (ఎన్టీఆర్), బాలికల మేనేజర్ ఎం. సంతోషి కుమారి (కర్నూలు), బాయ్స్ టీమ్ మేనేజర్ డి. సుంకర రావు (కర్నూలు) వ్యవహరిస్తున్నారు. 

G. Bhanumurthy Raju
Under-17 Sepak Takraw
Andhra Pradesh
School Games Federation
Imphal
Manipur
National Level Competition
AP Students
Sports
  • Loading...

More Telugu News