ICICI Bank: టీజీఐఐసీ మా వద్ద ఏ భూములను మార్టిగేజ్ చేయలేదు: ఐసీఐసీఐ బ్యాంకు

- కీలక ప్రకటన విడుదల చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
- కంచ గచ్చిబౌలిలోని భూములు మార్టిగేజ్ చేసి ప్రభుత్వం అప్పు తీసుకుందని బీఆర్ఎస్ ఆరోపణ
- టీజీఐఐసీకి తాము ఎలాంటి మార్టిగేజ్ రుణం ఇవ్వలేదని చెప్పిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.
టీజీఐఐసీకి తాము ఎలాంటి తనఖా రుణం ఇవ్వలేదని తెలిపింది. టీజీఐఐసీ తమ వద్ద ఏ భూములను తనఖా పెట్టలేదని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది.
కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీజీఐఐసీకి అకౌంట్ బ్యాంకుగా మాత్రమే తాము వ్యవహరించామని ఐసీఐసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.