Chandrababu Naidu: ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు... ఫొటోలు ఇవిగో!

కడప జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నేడు సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. భారీ వేదికపై ఈ కల్యాణ క్రతువును నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి విచ్చేశారు. ప్రభుత్వ తరఫున చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.











