Telangana TET: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

Telangana TET Notification Released Exam Dates Announced

  • జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు
  • పూర్తి వివరాలు ఏప్రిల్ 15న వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడి
  • వెల్లడించిన పాఠశాల విద్యా శాఖ

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 15వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జులై 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఒక పేపర్ రాసేవారికి రూ. 500, రెండు పేపర్లు రాసేవారికి రూ. 1,000గా రుసుమును నిర్ణయించారు. జూన్ 9వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గత ఏడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు.

Telangana TET
TET Notification
Telangana Teacher Eligibility Test
June 2024 TET
TET Exam Dates
Telangana Education Department
Teacher Recruitment
School Education
  • Loading...

More Telugu News