Ram Charan: 'కాంపా' బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్... రిలయన్స్ తో జట్టుకట్టిన గ్లోబల్ స్టార్

Ram Charan becomes Campa drink Brand Ambassador

  • రిలయన్స్ అధీనంలో కాంపా డ్రింక్ 
  • రామ్ చరణ్ తో కీలక భాగస్వామ్యం
  • కాంపా యాడ్ లో నటించిన గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో జట్టుకట్టాడు. రిలయన్స్ కు చెందిన ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ కాంపా డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 మార్చిలో మార్కెట్లో రంగప్రవేశం చేసిన కాంపా వేగంగా ఎదుగుతోంది. 

ఈ నేపథ్యంలో, భారత్ లో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రామ్ చరణ్ తో భాగస్వామ్యం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కాగా, రామ్ చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను కూడా రూపొందించారు. 'కాంపా వాలీ జిద్ద్' పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఈ యాడ్ ను ఐపీఎల్ లోనూ, ఇతర వేదికలపైనా, టీవీల్లో, మొబైల్ వేదికలపైనా ప్రసారం చేయనున్నారు.

Ram Charan
Ram Charan Brand Ambassador
Campa Cola
Reliance Industries
Campa Drink
Campa Cola Brand Ambassador
Bollywood Actor
Indian Celebrities
IPL Advertisement
Campa Advert
  • Loading...

More Telugu News