KTR: ఆ వేల కోట్ల రూపాయల కమీషన్ పోయిందని కేటీఆర్‌కు అక్కసు: మహేశ్ కుమార్ గౌడ్

KTR Accused of Crores Commission Scandal Mahesh Kumar Goud

  • పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వేలాది ఎకరాలను విక్రయించిందన్న టీపీసీసీ చీఫ్
  • కంచ గచ్చిబౌలి భూముల గురించి పదేళ్లు ఎందుకు పోరాడలేదని ప్రశ్న
  • కోకాపేటలో వేలాది ఎకరాలను విక్రయించారని ఆగ్రహం

బిల్లీరావుతో కుదుర్చుకున్న వేల కోట్ల రూపాయల కమీషన్ ఒప్పందం చేజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్రోశంతో మాట్లాడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది ఎకరాల భూమిని విక్రయించారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూమిని తమ అనుయాయులకు కట్టబెట్టిందని ఆయన దుయ్యబట్టారు. కంచ గచ్చిబౌలి భూముల గురించి గత పదేళ్లలో ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలను సాధించిందని, లేకుంటే అవి ఐఎంజీ చేతికి వెళ్లేవని అన్నారు. 

కోకాపేటలో వేల ఎకరాలను రూ. 100 కోట్లకు ఎకరం చొప్పున విక్రయించలేదా అని మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది ఎకరాలను విక్రయించినప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 400 ఎకరాల భూముల్లో కంపెనీలు వస్తే రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు.

KTR
Mahesh Kumar Goud
Telangana
TRS
Land Scam
Brs Government
Land deals
Hyderabad land
Crores Commission
Political Controversy
  • Loading...

More Telugu News