Donald Trump: ట్రంప్ నిర్ణయంతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

- టారిఫ్ లకు 90 రోజుల పాటు బ్రేక్ వేస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్
- 1,310 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 429 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లకు 90 రోజుల పాటు బ్రేక్ వేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మన మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ... అది మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం గమనార్హం.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,310 పాయింట్లు లాభపడి 75,157కి ఎగబాకింది. నిఫ్టీ 429 పాయింట్లు పుంజుకుని 22,828 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.05 గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
టాటా స్టీల్ (4.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.72%), ఎన్టీపీసీ (3.25), కోటక్ బ్యాంక్ (2.85%), రిలయన్స్ (2.84%).
టాప్ లూజర్స్
ఏషియన్ పెయింట్స్ (-0.76%), టీసీఎస్ (-0.43%).