Chebrolu Kiran: చేబ్రోలు కిరణ్ ను నారా లోకేశ్ పోషిస్తున్నారు: అంబటి రాంబాబు

- వైసీపీ నేతలపై చాలా కాలంగా కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న అంబటి
- గోరంట్ల మాధవ్ ను కలిసేందుకు నల్లపాడు పీఎస్ కు వచ్చిన మాజీ మంత్రి
- మాధవ్ ను పోలీసులు ఎలా ట్రీట్ చేశారో తెలుసుకునేందుకు వచ్చానన్న అంబటి
మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంత్రి నారా లోకేశ్ పోషిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ నేతలపై సుదీర్ఘ కాలంగా కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కలిసేందుకు నల్లపాడు పీఎస్ కు అంబటి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మాధవ్ ను గత రాత్రి పోలీసులు ఎలా ట్రీట్ చేశారో తెలుసుకునేందుకు వచ్చానని అంబటి తెలిపారు. నల్లపాడు పీఎస్ నుంచి నగరపాలెం పీఎస్ కు మాధవ్ ను తరలిస్తామని పోలీసులు చెప్పారని వెల్లడించారు. కోర్టు ముందు ప్రవేశపెట్టే సమయంలో ఆయనను కలిసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారని తెలిపారు.