రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
- వెల్లడించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్
- ఉయదం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
- ఈ ఏడాది పరీక్షలకు ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరు
ఫలితాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inతో పాటు మన మిత్ర నంబర్ 9552300009కు హాయ్ అని సందేశం పంపి తెలుసుకోవచ్చని మంత్రి అన్నారు. కాగా, ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. వీరంతా ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.