Nitish Kumar: సీఎం నితీశ్ కుమార్ భవితవ్యంపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

- నితీశ్ మరికొన్ని రోజులు మాత్రమే సీఎంగా ఉంటారన్న పీకే
- నితీశ్ ను బీజేపీ మరోసారి సీఎంగా అంగీకరించబోదని వ్యాఖ్య
- ఇండియా కూటమి తరపున గెలిచినా సీఎం కారన్న పీకే
బీహార్ సీఎం నితీశ్ కుమార్ గురించి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ చివరి రాజకీయ ఇన్నింగ్స్ లో ఉన్నారని చెప్పారు. ఆయన మరికొన్ని రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని అన్నారు. నితీశ్ ను బీజేపీ మరోసారి సీఎంగా అంగీకరించదని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసిన ఇండియా కూటమి తరపున గెలిచినా నితీశ్ సీఎం అయ్యే అవకాశం లేదని అన్నారు. నితీశ్ మరో 5 నెలలు మాత్రమే సీఎంగా ఉంటారని చెప్పారు.
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ కు చెందిన ఆర్జేడీ పోటీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా... సీఎం పదవిని బీజేపీ వదులుకునేందుకు సిద్ధంగా లేదని చెపుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రశాంత్ కిశోర్ తెలిపారు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు.