Venkaiah Naidu: తెలంగాణ ప్ర‌భుత్వానికి వెంక‌య్యనాయుడు సూచన

Venkaiah Naidu Requests Telangana Govt to Reconsider Sanskrit as Second Language

  • తెలంగాణ‌ జూనియ‌ర్ కాలేజీల్లో ద్వితీయ భాష‌గా సంస్కృతం అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు వార్త‌లు
  • మార్కుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం పున‌రాలోచ‌న చేయాల‌ని కోరిన వెంక‌య్య‌
  • ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా మాజీ ఉపరాష్ట్ర‌ప‌తి పోస్ట్

తెలంగాణ ప్ర‌భుత్వం జూనియ‌ర్ కాలేజీల్లో ద్వితీయ భాష‌గా సంస్కృతం అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు వచ్చిన వార్త‌లు విని విచారం క‌లిగింద‌ని మాజీ ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం పున‌రాలోచ‌న చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న పోస్ట్ చేశారు. 

"విద్యార్థుల‌ను మ‌న మాతృభాష‌కు దూరం చేయ‌డం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించ‌డంలో త‌ప్పులేదు. అదే స‌మ‌యంలో మ‌న సంస్కృతిని అందిపుచ్చుకునే దిశ‌గా అమ్మ భాష ఆలంబ‌న‌గా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యా విధానం-2020 కూడా దానికి ప్రాధాన్య‌త ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థుల‌ను మాతృభాష‌కు మ‌రింత చేరువ చేసే దిశ‌గా తెలంగాణ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని వెంక‌య్య‌నాయుడు పేర్కొన్నారు.  

Venkaiah Naidu
Telangana Government
Sanskrit
Junior Colleges
Mother Tongue
National Education Policy 2020
Second Language
Education Policy
Telangana Education
  • Loading...

More Telugu News