Ram Gopal Varma: తగ్గేదేలే అంటున్న వర్మ... మరో సినిమా ప్రకటన

- మరో హారర్ సినిమాను ప్రకటించిన వర్మ
- 'పోలీస్ స్టేషన్ మే బూత్' సినిమాను తెరకెక్కించనున్న వర్మ
- ప్రధాన పాత్రను పోషిస్తున్న మనోజ్ బాజ్ పేయి
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'శారీ' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ అందాలను ఆరబోసినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. వరుసగా ఫ్లాపులు వస్తున్నప్పటికీ వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. మరో సినిమాను ప్రకటించారు. 'పోలీస్ స్టేషన్ మే బూత్' అనే హారర్ చిత్రాన్ని ప్రకటించారు. 'మీరు చనిపోయిన వారిని చంపలేరు' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
ఈ సినిమాలో మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ... మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు వెళతామని... పోలీసులు భయపడినప్పుడు ఎక్కడకు పరుగెత్తుతారు? అనే పాయింట్ మీద కథ తిరుగుతుందని చెప్పారు. ఒక భారీ ఎన్ కౌంటర్ తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దెయ్యాల స్టేషన్ గా మారుతుందని... గ్యాంగ్ స్టర్ దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగెత్తుతూ ఉంటారని తెలిపారు. ఈ సినిమాపై వర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.