రైతు కూలీగా మారి.. ధాన్యాన్ని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్
- పాతూరు గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
- కేంద్రంలో వివిధ పనులు చేసిన కలెక్టర్ సహా అధికారులు
- రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచన
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాలలో ప్యాడీ క్లీనర్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఇదిలా ఉండగా, గతంలో ఆయన ఔరంగాబాద్ గ్రామంలో వరి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.