Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట

Posani Krishna Murali Gets Relief from AP High Court

  • పోసానిపై సూళ్లూరుపేట పోలీసుల కేసు
  • పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
  • విచారణ అధికారిపై హైకోర్టు సీరియస్

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. 

కేసులో అదనంగా 111 సెక్షన్ తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారంటూ సెక్షన్లు నమోదు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

Posani Krishna Murali
AP High Court
Quash Petition
Soollurupeta Police
Section 111
AP Police
Indian Cinema
Telugu Actor
Legal Case
Court Hearing
  • Loading...

More Telugu News