Chhaava Movie: ఓటీటీలోకి 'ఛావా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే..!

Vicky Kaushals Chhaava Streaming on Netflix from April 11th
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్, ర‌ష్మిక జంట‌గా ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ తాజా చిత్రం 'ఛావా'. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ ఈ సినిమాను నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌లైన ఈ మూవీ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసులవ‌ర్షం కురిపించింది. కేవ‌లం హిందీలోనే రూ.800 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్ట‌డం విశేషం.

ఈ సినిమాను మార్చి 7న టాలీవుడ్‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తెలుగులో విడుద‌ల చేయ‌గా... భారీ వ‌సుళ్ల‌ను సాధించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేర‌కు నెట్‌ఫ్లిక్స్ తాజాగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 
Go Back to Shorts
Chhaava Movie
Vicky Kaushal
Rashmika Mandanna
Lakshman Utekar
Netflix
OTT Release
Bollywood Movie
Telugu Release
Historical Drama
Samartha Ramdas

More Telugu News