ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో నేడు వైఎస్ జగన్ సమావేశం
- తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం
- నేతలకు దిశానిర్దేశం చేయనున్న వైఎస్ జగన్
- ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, కూటమి ప్రభుత్వం అమలు చేయని ఎన్నికల హామీలపై ప్రజా పోరాటం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వైసీపీ నేతలు తాడేపల్లికి చేరుకున్నారు.